కేసులకు భయపడను-డికే ఆరుణ.

హైదరాబాద్ ముచ్చట్లు:
జూబ్లీహిల్స్ లోని డీకే అరుణ నివాసంలో  డీకే అరుణ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసారు. పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పారు. డీకే ఆరుణ మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేసారు అనేది పూర్తి అవాస్తవం… కట్టుకథ, కల్పితం. అనవసరంగా మా మీద బురద జల్లుతున్నారని అయన అన్నారు. శ్రీనివాస్ గౌడ్ యొక్క అవినీతి, అరాచక పాలన అందరికి తెలుసు. మంత్రి, అభద్రత భావానికి గురి అవుతున్నాడు. మహబూబ్నగర్ లో రాక్షస పాలన రాజ్యం ఏలుతుంది.ఆయనను చంపించాల్సిన అవసరం మాకు కానీ మా పార్టీ కి గాని లేదు. శ్రీనివాస్ గౌడ్ అవినీతి పరుడు.. ఉద్యమకారుడు అనే ముసుగు కప్పుకున్నాడని ఆరోపించారు. ఉద్యోగి గా ఉన్నపుడు రెండు సార్లు ఏసీబీకి దొరికాడు. అవినీతి కేసులో పట్టుబడ్డాడు.. సస్పెండ్ అయ్యాడు. ఇదంతా కేసీఆర్ కుట్ర… రాష్ట్రము లో బీజేపీ ఎదుగుదల ఓర్వలేకపోతున్నారని అన్నారు. నేను ఏ విచారణకు అయినా సిద్ధం..కేసులకు, విచారణకు నేను భయపడను. రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు. కేంద్ర  సంస్థల చేత విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేసారు.
Tags:Do not be afraid of cases-Dickey Aruna

Leave A Reply

Your email address will not be published.