అధైర్య పడకండి… అండగా ఉంటాం – కోవిడ్ బాధితులకు సర్పంచ్ నారాయణ రెడ్డి భరోసా

పుంగనూరు ముచ్చట్లు:

పర్యావరణ_దినోత్సవం సందర్భంగా, పీవర్ సర్వే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా   కరోన భారిన పడిన వారు అధైర్య  చెందాల్సిన పనిలేదని నెక్కొంది గ్రామ సర్పంచ్ నారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం పంచాయతీ పరిధిలోని  మొరుoపల్లి గ్రామంలో పాజిటివ్ వచ్చిన వారిని పరామర్శించి ప్రభుత్వం అందిస్తున్న మెడికల్ కిట్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన పాజిటివ్ వచ్చిన వారెవరు అధైర్యo చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉందన్నారు.  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి,మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ అక్కిసాని భాస్కర్ రెడ్డి ఆదేశాలు  మేరకు,ముందస్తుగా కరోన పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ కరోన నివారణకు అధికారులు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. కరోన సోకిన వారు జాగ్రత్తలు పాటిస్తూ అధికారులు ఇచ్చిన మందులు వేసుకుంటే త్వరగా తగ్గుముఖం పడుతుందన్నారు. ప్రజలు కూడా అనవసరంగా బయట సంచరించకుండా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ బసవరాజు ,యంపీటీసి అభ్యర్థి భాస్కర్,గ్రామ వాలంటీర్లు మోహన్ కుమార్,సోము,సునీత సచివాలయ సిబ్బంది మరియు ఫీల్డ్ అసిస్టెంట్ సురేంద్ర,వార్డు మెంబర్స్ హరీష్,వెంకటరమణ, శ్రీనివాసులు,ఆశ వర్కర్లు,పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Do not be discouraged … we will be fine
– Sarpanch Narayana Reddy assures Kovid victims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *