అధైర్య పడకండి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది

కోవిడ్ బాధితులకు జడ్పీ చైర్మన్ లింగాల భరోసా
మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులను పరామర్శించిన జడ్పీ చైర్మన్

ఖమ్మం ముచ్చట్లు:

కరోన సోకిందని అధైర్య పడవద్దని అన్ని విధాలుగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కరోనా బాధితులకు భరోసా కల్పించారు. శుక్రవారం మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులను డాక్టర్ అనిల్ కుమార్ తో కలిసి పరామర్శించారు. కరోనా బాధితులు మనోధైర్యంతో ఉండాలని అధైర్య పడవద్దని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించడం జరిగిందని వారికి తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ తో మాట్లాడుతూ ఇన్ వార్డు పేషెంట్ల వివరాలు ఎంతమంది ఉన్నారు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిత్యం రోగులకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సైదులు, డాక్టర్ మనోరమ, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, రైతుబంధు మండల కన్వీనర్ చావా వేణు, మున్సిపల్ ఫోర్ లీడర్ యాన్నం శెట్టి వెంకటఅప్పారావు, రెండో వార్డు కౌన్సిలర్ ఇక్బాల్, టిఆర్ఎస్ పట్టణ బాధ్యులు కనుమురి వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ యువజన నాయకులు నరేందర్ రెడ్డి, ముత్తవరపు ప్యారి,జె వి రెడ్డి, ఎం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Do not be discouraged
The Telangana government is in favor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *