అసమ్మతి శాంతించాలి..ముందడుగేయాలి..

Date:14/09/2018
నిర్మల్‌ ముచ్చట్లు:
ముందస్తు ఎన్నికలు తమకు ప్లస్ అవుతుందని టీఆర్ఎస్ అధినేత..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకంతో ఉన్నారు. మరోసారి విజయం సాధించి అధికారం కైవసం చేసుకుంటామన్న ధీమా ఆయనలో ఉంది. పార్టీ వర్గాలు సైతం కేసీఆర్ ఇమేజ్.. ప్రభుత్వ సంక్షేమ పథకాలే.. వచ్చే ఎన్నికల్లో విజయాన్ని కట్టబెడతాయని విశ్వసిస్తున్నాయి.
ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఎన్నికల టైమ్‌లో వచ్చే సమస్యలు టీఆర్ఎస్‌నూ చుట్టుముట్టాయి. ప్రధానంగా ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడ్డ వారు తీవ్రనిరాశలో కూరుకుపోయారు. వారిలో కొందరు అసమ్మతి గళం బహిరంగంగానే  వినిపిస్తున్నారు. ఇప్పటికే చెన్నూరు.
మాజీ ఎమ్మెల్యే ఓదేలు.. స్వీయ గృహనిర్బంధం విధించుకుని సీటు రానందుకు తన నిరాశ, నిస్పృహలను వెళ్లగక్కారు.ఇలా పలువురు నేతలు తమ అసంతృప్తులు వ్యక్తపరచడం ముమ్మరంచేశారు. నిర్మల్‌ జిల్లాలోనూ ఈ తరహా అసమ్మతి సెగలు ఎగసిపడుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి సైతం అసమ్మతి సెగ తప్పలేదని పలువురు అంటున్నారు. గత
ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓటమిపాలైన శ్రీహరిరావు తన వర్గీయులతో ఇప్పటికే సమాలోచనలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు ఐకే రెడ్డి తమకు పదవులు ఇవ్వలేదని.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారని రాజకీయ వర్గాల కథనం.
ప్రభుత్వ పథకాలు తమ వర్గీయులను దూరం పెట్టారని ఆరోపించినట్లు వార్తలొస్తున్నాయి. తమకు ప్రాథాన్యం ఇస్తేనే పార్టీలో కొనసాగుతామంటూ ఇవ్వాలని శ్రీహరిరావు వర్గీయులు డిమాండు చేస్తున్నారని మరికొందరు చెప్తున్నారు.
నిర్మల్ జిల్లాలకు చెందిన ఆశావహులే కాక.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డవారు క్రమేపీ తమ అసంతృప్తిని వెళ్లగక్కే కార్యక్రమం ప్రారంభించారు. దీంతో ఉమ్మడిజిల్లా టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగ కాకపుట్టిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్.. ఎక్కువగా సిట్టింగ్‌ల ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించారు. దీంతో ఈ దఫా తమకు ఛాన్స్ రావచ్చని ఆశపడ్డవారికి నిరాశే ఎదురైనట్లైంది. గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉండి.
ప్రజలకుబాగా చేరువైన ఎమ్మెల్యేలవైపే కేసీఆర్ మొగ్గుచూపారు. పైగా..రెండోసారి విజయం సాధించి అధికారం నిలబెట్టుకోవాలన్న ధ్యేయంతో కొత్త అభ్యర్ధులకు ఆయన కొంత దూరంగానే ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపిక ఆషామాషీగానూ చేయలేదు.
బాగా స్టడీచేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ ఇదివరకే తేల్చి చెప్పారు. కేసీఆర్ వివరణ ఎలా ఉన్నా టికెట్లు రాని వారు మాత్రం నిరాశలో కూరుకుపోయారు. ఇప్పటికే ఖానాపూర్, ముథోల్‌ నియోజకవర్గాల్లో టికెట్లు రాక భంగపడ్డవారు అసమ్మతివాదాన్ని వినిపించారు. ఇక చెన్నూరు నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహించిన నల్లాల ఓదెలు అయితే ఏకంగా తన కుటుంబ సభ్యులందరితో కలిసి స్వీయ గృహ నిర్బంధం విధించుకుని కలకలం రేపారు.
లేటెస్ట్‌గా చెన్నూరుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేఅభ్యర్ధి  బాల్క సుమన్ ర్యాలీలో కొందరు అసమ్మతివాదులు హల్‌చల్ చేశారు. ఏకంగా ఆత్మహత్యయత్నాలకు యత్నించి నిర్ఘాంతపరిచారు. ఏదేమైనా జిల్లాలో అసమ్మతిని జయించి ఎన్నికలకు సన్నద్ధమవ్వాల్సి ఉంది టీఆర్ఎస్.
Tags: Do not be dissatisfied ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *