Do not be misled on EVMs

ఈవిఎంలపై అపోహ పడవద్దు

– ఈఆర్‌వో కనక నరసారెడ్డి

Date:17/02/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

 

ఎన్నికల కమిషన్‌ వినియోగిస్తున్న ఈవిఎంలపై ఎలాంటి అపోహలు పడరాదని, ఈవిఎంలు సక్రమంగా పటిష్టంగా పనిచేస్తాయని పుంగనూరు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కనక నరసారెడ్డి తెలిపారు. ఆదివారం తహశీల్ధార్‌ కార్యాలయంలో తహశీల్ధార్‌ మాదవరాజుతో కలసి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఈవిఎంల పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఆర్‌వో మాట్లాడుతూ రాజకీయ పార్టీలలో కొంత మంది ఈవిఎంల పనితీరుపై అపోహలు పడుతున్నారని , వీటిని తొలగించుకోవాలన్నారు. ఎన్నికల పక్రియను జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఆధ్వర్యంలో పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. అసత్య ఆరోపణలు, అనుమానాలతో ప్రజాస్వామ్య పద్దతులను కించపరచినట్లు అవుతుందన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు నీతినిజాయితీగా ఎన్నికల నిబంధనలను అమలుజరపడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ, చైతన్యకార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల డీటి రమేష్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప, తెలుగుదేశం నాయకుడు కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

బీసీల సదస్సులో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగంపై స్పందన

 

Tags; do-not-be-misled-on-evms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *