చెత్త పర్వతాలపై చెక్ పెట్టరా…

Do not check on the worst mountains ...

Do not check on the worst mountains ...

 Date:13/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీలో భారీగా పేరుకుపోయిన ‘చెత్త పర్వతాలు’ నగరం ఎదుర్కొంటున్న అధ్వాన పరిస్థితిని సూచిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి తగు చర్యలు చేపట్టకపోవడంపై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డంపింగ్‌ యార్డులైన ఘాజీపూర్, ఓక్లా, బల్స్‌వాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్త పర్వతాలను ప్రస్తావిస్తూ.. అధికారులు గానీ, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయ అధికారులుగానీ ఘన వ్యర్థాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతోనే నగరం ఈ దుస్థితిని ఎదుర్కొంటోందని పేర్కొంది.ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యత మున్సిపల్‌ కార్పొరేషన్‌దేనని ఢిల్లీ ప్రభుత్వ, గవర్నర్‌ కార్యాలయ అధికారులు కోర్టుకు తెలుపగా.. ఇది బాధ్యతను మరొకరిపై తోసెయ్యడం తప్ప మరొకటి కాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయనందుకు 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు జరిమానా విధించింది.
చెత్త పర్వతాలపై చెక్ పెట్టరా… https://www.telugumuchatlu.com/do-not-check-on-the-worst-mountains/
Tags:Do not check on the worst mountains …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *