బీసీ కళాశాల, వసతి గృహలను మూసివేయొద్దు
బీసీ కళాశాల, వసతి గృహలను మూసివేయొద్దు
డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షుడు కూర్మాచలం ఉమా మహేష్
Date:07/06/201 9
జగిత్యాల ముచ్చట్లు:
ధర్మపురి మండల కేంద్రంలోని బీసీ కళాశాల వసతి గృహాలను విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారనే సాకుతో మూసివేయడం తగదని అధికారులకు డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షుడు కూర్మాచలం ఉమా మహేష్ కొరారు.జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ
మండల కేంద్రంలో బీసీ కళాశాల వసతి గృహాలను ఏర్పాటు చేసిన ఇప్పటికీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, అంతేగాక సుమారు 4 సంవత్సరాల నుండి పూర్తి స్థాయి వార్డెన్లను భర్తీ చేయకపోవటంతో పాటు మౌలిక వసతులు ప్రభుత్వం కలించకపోవటం వల్లే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చాయని పేర్కొన్నారు. అన్ని వసతులు కల్పించి హాస్టళ్లను బలోపేతం చెయ్యాల్సింది పోయి విద్యార్థులు లేరని సాకుతో హాస్టళ్లను మూసివేయడం సమంజసం కాదన్నారు.హాస్టళ్లను మూసివేత దిశగా అధికారులు నాయకులు ఆలోచనలు చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
10 వ తేదీ నుండి టిటిడి కళాశాలల్లో కౌన్సిలింగ్
Tags:Do not close BCC college and accommodation