కుంటిసాకులతో రావడంలేదు

Date:14/07/2020

అమరావతి ముచ్చట్లు:

టిడిపి ఎమ్మెల్సిలు పోతుల సునీత, శివనాథ రెడ్డిల అనర్హత పిటిషన్ లపై మంగళవారం మండలి ఛైర్మన్ వద్ద విచారణ జరిగింది.  విచారణకు టీడీపీ తరపున పిటిషనర్ బుద్దా వెంకన్న, అశోక్ బాబు లు హజరయ్యారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఆరవ వాయిదాకి కూడా ఆరోగ్య కారణాలు చూపుతూ వారు హజరుకాలేదు.
వస్తే పార్టీ మారినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది. అందుకే కుంటి సాకులతో బయపడి రావడం లేదు. వైసిపి ఆశయాలు నచ్చి వెళితే ఆవిషయం ఛైర్మన్ కు వచ్చి చెప్పాల్సింది. ప్రతి వాయిదాకు వారి లాయర్లును పంపడం వారు హజరు కాకపోవడం కరెక్టు కాదు. వచ్చే వాయిదాలో పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని అన్నారు.మరో ఎమ్మెల్పీ అశోక్ బాబు మాట్లాడుతూ టీడీపీ తరపున హజరు అయ్యాం. మా అడ్వకేట్ లు క్వారంటైన్ లో ఉండడంతో రాలేకపోయారు. సుప్రీంకోర్టు చెప్పినట్టు, పార్లమెంటులో ఉన్న పద్దతిలో డిస్ క్వాలిఫికేషన్ ను 3 నెలల్లో ఫైనలైజ్ చేయాలని కోరాం. ప్రతి సారి వారి సాకులు పరిగణలోనికి తీసుకుంటే రెండు సంవత్సరాలు అయినా ఈ పిటిషన్ పై నిర్ణయం రాదు. వచ్చే వాయిదాలో అయినా వారిని డిస్ క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ ఎవ్వరు వచ్చినా రిజైన్ చేసి తీసుకుంటామన్నారు. దానికి కట్టుబడాలని కొరుతున్నాం.  మేము ఛైర్మన్ ని వచ్చే వాయిదాలో అయినా మెరిట్స్ ఆధారంగా చర్యలు తసుకోవాలని కోరామని అయన అన్నారు.

నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

Tags: Do not come with lashes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *