Do not drive fast-moving families

వేగంగా వాహనాలు నడిపి కుటుంబాలను వీధినపడేయకండి

– ఎంవిఐ మనోహర్‌రెడ్డి

Date:20/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

అతివేగంగా వాహనాలు నడిపి , ప్రమాదాలకు గురై అమాయకులైన కుటుంబ సభ్యులను వీధినపడేయకండి అంటు మదనపల్లె ఎంవిఐ మనోహర్‌రెడ్డి డ్రైవర్లను ప్రాధేయపడ్డారు. సోమవారం పోలీస్‌ స్టేషన్‌లో సీఐ గంగిరెడ్డి , ఎస్‌ఐ తిప్పేస్వామితో కలసి ఆయన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ డీటీసీ బసిరెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 31 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహి ంచి డ్రైవర్లను, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మధ్యంసేవించి వాహనాలను నడపడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ నడపడం , అతివేగంగా వాహనాలను నడపడం ప్రమాదకరమన్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో రహదారిన వెళ్లే అమాయకులతో పాటు డ్రైవర్ల కుటుంబ సభ్యులు కూడ వీధినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లు రెప్పపాటులో ప్రమాదాలు చేస్తున్నారని దీనిని గమనించి, రోడ్డుపై జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరు వాహనాలకు అన్ని రికార్డులను ఉంచుకోవాలన్నారు. డ్రైవింగ్‌ లైసెన్సు ఖచ్చితంగా ఉండాలన్నారు. రికార్డులు లేకపోయినా, లైసెన్సులు లేకపోయి ప్రమాదాలు జరిగితే డ్రైవర్లతో పాటు యజమానులకు జైలుశిక్షలు తప్పవని హెచ్చరించారు. డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటు ప్రయాణాలు జరిపితే ప్రమాదాలు జరగవని సూచించారు. రోడ్డు భద్రతలను పాటించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెను పాటించాలి

Tags: Do not drive fast-moving families

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *