కమలంలో వర్గపోరు!

Do not fall into the lotus!

Do not fall into the lotus!

Date:12/10/2018
సికిందరాబాద్  ముచ్చట్లు:
సికింద్రాబాద్ నియోజకవర్గం లో బీజేపీ వర్గపోరు మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం
 ఇంతవరకు అభ్యర్టులను ఖరారు చేయకపోయినా పలువురు తమకే టికెట్ దక్కుతుందని భావిస్తున్నారు. కొందరైతే టికెట్ తమకే వస్తుందని చెప్తూ ప్రచారం కూడా సాగిస్తున్నా పెట్టారు. దీంతో కార్యకర్తల్లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఇదిలాఉంటే ఈ ప్రాంతంలో అసమ్మతి వాణి కూడా వినిపిస్తోందని సమాచారం. పార్టీసిద్దాంతాల కోసం సంవత్సరాల తరబడి  కష్టపడుతున్న వారికి కాకుండా నియోజకవర్గాలకు సంబందం లేని వ్యక్తులకు కేటాయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్ నియోజక వర్గం బీజేపీ టికెట్ తనకేనని బండపల్లి సతీష్ గత కొద్ది రోజులుగా జోరుగా పరచడం సాగిస్తున్నారు.
ప్రతీ బస్తి, గల్లీ తిరుగుతూ తనకే ఓటు వేయాలని కోరుతున్నారు. మరోవైపు ప్రవీణ్ చంద్ర పిడిశెట్టి కూడా తనకే సీటు దక్కుతుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి గా అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుందని ఇప్పటికే చెప్పేశారట ఆయన. పార్టీ సిద్ధాంతాలను పక్కన బెట్టి స్వార్ధ ప్రయోజనాల కోసమే కొందరు ప్రాకుళ్లాడుతున్నారని ఆరోపించారట. ఇదిలాఉంటే స్థానికంగా చురుగ్గా వ్యవహరిస్తున్న మరో నేత కూడా టికెట్ పై గంపెడాశలు పెట్టుకున్నారు. చివరికి తానే బరిలో ఉంటానన్న ధీమాలో ఉన్నారు.
నేతల ఆశలు, ఆశయాలు ఎలా ఉన్నా.. కార్యకర్తల్లో మాత్రం కొంత ఆందోళన నెలకొంది. పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించకముందే పార్టీలో అంతర్గత పోరు మొదలైందని కార్యకర్తలు వాపోతున్నారు. అంతర్గత పోరు ఉంటే త్వరితగతిన సమసిపోయేలా పెద్దలే చొరవ చూపాలని కార్యకర్తలు ఆశిస్తున్నారు. ఆశావహుల మధ్య పోరు తీవ్రరూపం దాల్చితే పార్టీకి అసౌకర్యంగా మారుతుందని అంటున్నారు. నేతలంతా విబేధాలు వీడి పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచిస్తున్నారు.
Tags:Do not fall into the lotus!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *