సైబర్‌ నేరాల వలలో చిక్కుకోకండి

Do not get caught in the trap of cyber crimes

Do not get caught in the trap of cyber crimes

– సీఐ నాగశేఖర్‌

Date:30/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

సమాజంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు సైబర్‌ నేరాల భారిన పడి నష్టపోతున్నారని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని పుంగనూరు సీఐ నాగశేఖర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో గల కుమార్‌ ఇన్స్టిట్యూట్ ఆఫ్‌ పోలీస్‌ అకాడమి డైరెక్టర్‌ కుమార్‌రెడ్డి , ప్రిన్సిపాల్‌ ఆనందకుమార్‌ ఆధ్వర్యంలో సైబర్‌నేరాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపిపి శారద, అడిషినల్‌ పిపి ఆకుల చెన్నకేశవులు, న్యాయవాదులు రెడ్డెప్ప, ప్రకాష్‌, హితేంద్ర, వెంకటపతి, సమీవుల్లా, ఎస్‌ఐ సహదేవి, హాజరైయ్యారు. ఈ సందర్భంగా సీఐ నాగశేఖర్‌ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ ఆదేశాల మేరకు సైబర్‌నేరాలపై అవగాహన సదస్సులు ప్రతి రోజు నిర్వహించి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా పోలీస్‌శాఖలో ఉద్యోగాల శిక్షణలో ఉన్న అభ్యర్థులు ఈ విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తూ , అదే రీతిలోసైబర్‌ నేరాలను నియంత్రించేందుకు ఉధ్యమించాలన్నారు. ముఖ్యంగా అనుమానిత వ్యక్తులు సెల్‌ఫొన్ల ద్వారా బ్యాంకు ఏటిఎం వివరాలు, బ్యాంకు ఖాతాలు గూర్చి నేరస్తులు అడుగుతుంటారని, వారికి ఫోన్‌ ద్వారా సమాచారాలు అందజేయవద్దని సూచించారు. ఏదైన అనుమానం వస్తే తమకు తక్షణమే ఫిర్యాదు చేయాలని తెలిపారు. యువత ముఖ్యంగా సెల్‌ఫోన్లు ఇంటర్‌నెట్‌ మాయలో పడకుండ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో లెక్చరర్లు ఇ.కుమార్‌, రాము, దస్తగిరి, సత్యనారాయణ, పద్మనాభం, అమరనాథ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబరంగా ఆనందాల ఆదివారం

Tags:Do not get caught in the trap of cyber crimes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *