మైనర్లకు వాహనాలు ఇవద్దు
కాకినాడ ముచ్చట్లు:
పిల్లల పై ప్రేమతో వారు కోరిన హై స్పీడ్ బైక్లు తమ స్తోమతకు మించి కొనిస్తే., వారు రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి రోడ్డు నిబంధనలు ఉల్లంఘించడం కాకుండా ప్రాణాలు మీదకు తెచ్చుకుంటూ.. ఇతరులను ప్రమాదాలకు గురిచేస్తున్న సందర్భంలో అనేక ఇబ్బందులు పడుతున్నారనీ కాకినాడ ట్రాఫిక్ డిఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలో రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బైక్ రైడింగ్స్ చేస్తున్న యువతను ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించి., వారి తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ చేస్తున్నామన్నారు.

Tags;Do not give vehicles to minors
