కంటి జబ్బుల్ని నిర్లక్ష్యం చేయకండి… జాగ్రత్తలు తీసుకోండి

Do not ignore the eye jabble ... take care

Do not ignore the eye jabble ... take care

— జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్

* ప్రాథమిక దశలో గుర్తిస్తే ఎలాంటి జబ్బునైనా నియంత్రించవచ్చు

* జిల్లా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఉచిత నేత్ర వైద్య శిభిరం

Date:12/05/2019

 

అనంతపురం ముచ్చట్లు:

కంటి జబ్బుల్ని నిర్లక్ష్యం చేయొద్దని… ప్రాథమిక దశలో గుర్తిస్తే ఎలాంటి జబ్బునైనా నియంత్రించే వెసలుబాటు అందుబాటులోకి వచ్చాయని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు సంక్షేమంలో భాగంగా ఉచిత నేత్ర వైద్య శిభిరం నిర్వహించారు. డాక్టర్ అక్బర్ నేత్ర వైద్యశాల సహకారంతో నిర్వహించిన ఈకార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కంటి ప్రాముఖ్యతను గుర్తించి సర్వేంద్రియానాం నయనం ప్రదానమని అన్నారు. కంటి పరీక్షలు తరుచూ చేయించుకోవాలన్నారు. ప్రస్తుత ఆహారపు అలవాట్లు, సరైన లైటింగ్ పద్ధతులు పాటించకపోవడం వల్ల చిన్న వయస్సులోనే కంటి సమస్యలు తలెత్తి చూపు సన్నగిల్లుతోందన్నారు. పిల్లల కంటి పరీక్షల విషయంలో అజాగ్రత్త ఉండరాదన్నారు. పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం తనకు చాలా ముఖ్యమన్నారు. ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా భావించి చాలా ఉచిత వైద్య శిభిరాలు నిర్వహించామన్నారు. సిబ్బంది ప్రతీ ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి దీర్ఘకాలిక వ్యాధుల నయం కోసం కృషి చేశామన్నారు. మున్ముందు ఇదే తరహాలో సిబ్బంది వారి కుటుంభాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం కంటి పరీక్షలు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ అక్బర్ , డాక్టర్ ఉమాకాంత్ , పెథాలజిస్ట్ నూర్ మహమ్మద్ , జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, తేజ్ పాల్ , గాండ్ల హరినాథ్ , ఆర్ ఐ ఆనందరెడ్డి, ఆర్ ఎస్ ఐ రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం

Tags: Do not ignore the eye jabble … take care

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *