Natyam ad

బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చవద్దు

మదనపల్లె ముచ్చట్లు:

బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని రాష్ట్ర గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోనేటి దివాకర్ నిరసించారు. నేడు మదనపల్లె పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ వైకాపా  ప్రభుత్వం బోయ ,వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రిటైర్డ్ ఐయేఎస్  ఆఫీసరుతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు జీవో నెంబరు 52 ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

Tags; Do not include Boya and Valmiki castes in ST

Post Midle
Post Midle