Date:30/11/2020
కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్
హైదరాబాద్ భువనగిరి ముచ్చట్లు
కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను తప్పుగా అర్థం చేసుకోరాదు అని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్లో రైతుల్ని కోరారు. గత ఏడాదితో పోలిస్తే పంజాబ్ రైతులు ఈ ఏడాది ఎక్కువ శాతం వరి పంటను అమ్మారని, అది కూడా ఎక్కువ కనీస మద్దతు ధరకు అమ్మినట్లు మంత్రి తెలిపారు. కనీస మద్దతు ధర ఇంకా ఉందని, అలాగే మార్కెట్లు కూడా ఉన్నాయన్నారు. ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని మంత్రి జవదేకర్ తెలిపారు. మరోవైపు పంజాబ్ రైతులు ఢిల్లీలో తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బురారిలోని నిరంకారి మైదానంలో రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. మరో వైపు ఇవాళ గురునానక్ జయంతి సందర్భంగా.. ధర్నాలో పాల్గొన్న రైతులు ప్రార్థనలు చేశారు. ఢిల్లీ-హర్యానా మధ్య ఉన్న సింఘూ సరిహద్ధు వద్ద సిక్కు రైతులు.. గురునానక్ జయంతి సందర్భంగా ప్రార్థనలు చేశారు. ఢిల్లీకి దారితీసే టిక్రీ, సింఘూ బోర్డర్లను రైతులు మూసివేశారు. దీంతో నిన్న రాత్రి హఠాత్తుగా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్లు అత్యవసరం సమావేశం ఏర్పాటు చేశారు.
కానిస్టేబుల్ పై దాడి చేసిన యువకుడు ఆరెస్టు
Tags:Do not misunderstand the newly introduced agricultural laws