Natyam ad

పార్కులు ప్రైవేటుపరం చేయోద్దు

విశాఖపట్నం ముచ్చట్లు:


అభివృద్ధి పేరుతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతి ద్వారా 283 ఎకరాల ముడసరలోవ పార్క్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిం చద్దని తెలుగుదేశం పార్టీ విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర ఆ పార్టీ నేతలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముడసర లోవ పార్కును అమ్మావద్దని డిమాండ్ చేశారు. వైసిపి అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖలో భూముల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే వాటర్ కన్సర్వేటివ్ జోన్ గా ఉన్న ముడాసరలోవ భూములను రిక్రియే షన్ జోన్ గా మార్చి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే కుట్రలు చేస్తున్నారని ఆందో ళన వ్యక్తం చేశారు. పబ్లిక్ భాగస్వామి లేకుండా నియంతృత్వంగా ఇటువంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నా రు. తక్షణం ఈ నిర్ణయం ఉపసంహరిం చుకోకపోతే ఆందోళన ఉదృతం అవు తుందని హెచ్చరించారు.

 

Tags; Do not privatize parks

Post Midle
Post Midle