వైకుంఠ ద్వార దర్శనానికి సిఫారసు లేఖలు పంపొద్దు

– వి ఐ పి లు స్వయంగా వారి కుటుంబ సభ్యులతో వస్తే దర్శనం కల్పిస్తాం
– సామాన్య భక్తుల ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకోండి
– వి ఐ పి లకు టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి
 
తిరుమల ముచ్చట్లు:
 
జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు కల్పిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపి లు సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని టీటీడీ కి సహకరించాలని ఆయన కోరారు.
పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయం లో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని  సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజా ప్రతినిధులకు తిరుమల లో ని నందకం, వకుళ ఆథితి గృహాల్లోవసతి కల్పిస్తున్నామని, ఒక వేళ తిరుమలలో వసతి సరిపోక పోతే తిరుపతి లోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతి లోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి పొందాలని చైర్మన్ తెలిపారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా విఐపి ల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తుల ఎక్కువ సమయం దర్శనం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని చైర్మన్  సుబ్బారెడ్డి తెలిపారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Do not send letters of recommendation for visit through Vaikuntha