అఘాయిత్యాలు ఆగడం లేదు : సుచరిత

Do not stop at: auspicious

Do not stop at: auspicious

Date:03/12/2019

నగరపాలెం ముచ్చట్లు:

గుంటూరు జిల్లా నగరంపాలెం మహిళా పోలీస్ స్టేషన్‌ను హోం మంత్రి సుచరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ హోం మంత్రికి ఓ మహిళ అక్కడ పిర్యాదు చేశారు. పోలీసు సిబ్బంది ఉదాసీన వైఖరిపై హోంమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులను పట్టించుకోకపోతే ఎలా ప్రశ్నించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు. నిర్భయ, దిశ ఘటనలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. పరిధి చూడకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. మహిళ భద్రతపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.
ఫిర్యాదుదారుల పట్ల  పోలీసులు దురుసుగా వ్యవహరించొద్దు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వసరం ఉంది. పోలీస్ స్టేషన్ల వద్ద ఫిర్యాదుల పెట్టె ఉంచే యోచనలో ఉన్నాం. మహిళా పోలీసు స్టేషన్లలో మహిళా అధికారులనే నియమిస్తాం’ అని సుచరిత అన్నారు. పోలీసు వ్యవస్థలో మరింత మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

 

దేశ తొలి రాష్ట్రపతికి సీఎం జగన్‌ నివాళి

 

Tags:Do not stop at: auspicious

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *