పీసీఐ అనుమతి లేకుండా జర్నలిస్టుల పై కేసులు పెట్టోద్దు

Date:26/05/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) లేదా ఇతర జ్యుడీషియరీ అధారిటీ అనుమతి లేకుండా జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తగదని, ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ అడ్వకేట్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తుల బండారం బయటపెడుతున్నన్యూస్ మీడియాను చానళ్లను, జర్నలిస్టులను కొందరు లక్ష్యంగా చేసుకుంటున్నారని, పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. రిపబ్లిక్టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, జీన్యాస్ ఎడిటర్ సుధీర్ చౌదరిపై ఇలాగే కేసులుపెట్టారని గుర్తుచేశారు. జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే వీసీఐ అనుమతినితప్పనిసరి చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన మార్గదర్శకాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు

Tags; Do not sue journalists without the permission of the PCI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *