నేనో శక్తిని ఓ శక్తి గురించి మాట్లాదావు ..కేసీఆర్‌ ఖబర్దార్‌ 

Do not talk about power in Neno energy .. KCRR Khabadadar

Do not talk about power in Neno energy .. KCRR Khabadadar

కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణ
రాజకీయం కోసం పూటకో పార్టీ మార్చిన కెసిఆర్
దుబాయ్‌ శేఖర్‌గా ఆయనకు పేరుపొందాడు
రఘువీరా రెడ్డి కి మంగళహారుతులు పట్టినా
దమ్ముంటే వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూపించు
ఒక్కో వేదికపై  నీ చరిత్రను బట్టబయలు చేస్తాం
Date:06/10/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
కేసీఆర్‌కు ఓడిపోతాననే భయం పట్టుకుందని, దీంతోనే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణతీవ్ర స్థాయిలో మంది పడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వనపర్తి సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఇంకా తెలంగాణ సెంటిమెంట్‌తో మాట్లాడి ప్రజలను మోసం చేయాలనే ధోరణిలో కేసీఆర్‌ ఉన్నారని విమర్శించారు. ఆయన మాటలను చూస్తేనే టీఆర్ఎస్‌ ఓడిపోతుందని స్పష్టమవుతుందన్నారు. ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఆయన భావిస్తున్నట్లు ఉందని, ఆయన మాటల్లో ప్రస్టేషన్ కనబడుతోందన్నారు.
ఉద్యమ సమయంలో ఏం మాట్లాడినా చెల్లిందని, ఇంకా అదే మాట్లాడుతానంటే కుదురదని, తెలంగాణ ప్రజలేం పిచ్చోళ్లు కాదన్నారు. ‘పాలమూరుకు ఏం ఓరగబెట్టినవ్‌.. 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినవా? ఇంకా జుటాకోర్‌ మాటలు మాట్లాడుతావా? 5 ఏళ్లు పాలమూరు ఏంపీ గా ఉండి ఏం చేసినవ్..జూరాలా, ఆర్డిఏస్,నెట్టెంపాడులకు ఓరగబెట్టింది ఏముంది.. ప్రాజెక్టుల వద్ద పడుకోని మీ నాయకులు ఏం చేసారు? తాము కట్టించిన గెస్ట్‌ హౌస్‌లో ఎంజాయ్‌ చేసారు.
డీకే అరుణమ్మ బండారం బయట పెడ్తావా? నాలుగేళ్లుగా ఏం చేశినావ్‌? దమ్ముంటే బయట పెట్టు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేస్తావా?. ఓ శక్తి గురించి మాట్లాడుతున్నావ్‌. కేసీఆర్‌ ఖబర్దార్‌.రఘువీరా రెడ్డి గారికి మంగళహారుతులు పట్టినా అని అన్నావ్‌.. దమ్ముంటే వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూపించు. రాజకీయం కోసం పూటకో పార్టీ మార్చినవ్‌ నీవు. దుబాయ్‌ శేఖర్‌గా పేరుపొందిన నీవు,. నా గురించి మాట్లాడుతావా? నా బండారం బయటపెడ్తావా? ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చినా. ఒక్కో వేదికపై  నీ చరిత్రను బట్టబయలు చేస్తాం. గద్వాల్లో ప్రతి ఇంట్లో అరుణమ్మ ఫొటో ఉంది. పాలమూరు ప్రజలకు కూడా తెలుసు.
Tags:Do not talk about power in Neno energy .. KCRR Khabadadar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *