Natyam ad

రసాయన ఎరువులు వద్దు సేంద్రియ ఎరువులే ముద్దు

-మండల వ్యవసాయ అధికారి కె. కళ్యాణ్ కుమార్
నంద్యాల ముచ్చట్లు:
 
దొర్నిపాడు మండలం డబ్ల్యు కొత్త పల్లె గ్రామంలో బుధవారం నాడు శనగ పంటలో వైయస్ ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కె. కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను ఆయన రైతులకు వివరించారు. సేంద్రీయ ఎరువుల వల్ల భూమిలో ఉన్న కిటక నాసి నసించి పోతున్నదని దీని వల్ల వేసిన పంటలకు పలు రకాల తెగుళ్లు సోకి పంట దిగుబడి తగ్గుతుందని ఆయన అన్నారు.  పొలం మట్టి రంగులు మారుతున్నదని మరియు సేంద్రియ ఎరువుల వల్ల మనము విషపూరిత ఆహారాన్ని తింటున్నామని దీని వల్ల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కావున రైతులు సేంద్రీయ ఎరువుల వాడకం మంచిదని ఆయన అన్నారు. సెనగ పంటలో కాండంతొలుసు పురుగును గుర్తించామని  రైతులు హెక్సోకోనోజల్ 20 యమ్ యల్ ఓక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్. గ్రామ పెద్దలు. వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Do not use chemical fertilizers. Kiss with organic fertilizers