ఉద్యోగులకు వ్యతిరేకమైన పీఆర్సీ వద్దు
పుంగనూరు ముచ్చట్లు:
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వ్యతిరేకమైన పీఆర్సీ తమకు వద్దని ఎస్టీయు ఆధ్వర్యంలో నిరసరన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఎస్టీయు నాయకులు కడియాల మురళి, అయూబ్‌ఖాన్, హరికిషోర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కడియాల మురళి మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నిరసన ర్యాలీ నిర్వహించి, తహశీల్ధార్‌కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా కొంత మంది ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి , ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పీఆర్సీని , డిమాండ్లను నేరవే ర్చాలని కోరారు. ఈ ర్యాలీలో సంఘ నాయకులు మోహన్ , బాబురెడ్డి, లింగయ్య, జయరాం, మంజునాథ్, గురుప్రసాద్, రమేష్, బుడ్డన్న, ప్రభాకర్ , నరేంద్ర, నరసింహులు, సురేష్ , శంకర్, అనిల్‌కుమార్ ,ప్రకాష్‌రెడ్డి, రామకృష్ణ, శ్రీరాములురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Do not want PRC against employees