ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వద్దు

-ఫిబ్రవరి 23,24 న దేశవ్యాప్త సమ్మె
విశాఖపట్నం ముచ్చట్లు:
పబ్లిక్ సెక్టార్ కంపెనీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 23, 24 తేదీలలో జాతీయ స్ట్రైక్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా నగరంలోని పౌర గ్రంథాలయంలో వివిధ పబ్లిక్ సెక్టార్ ల లో ఉన్నటువంటి సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులతో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఆలిండియా పోర్ట్ ఫెడరేషన్ కార్యదర్శి నరేంద్ర, సిపిఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశ సంపదను ప్రైవేటీకరించడం ద్వారా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. దీనిని దేశ ప్రజలంతా సంఘటితంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23, 24 తేదీలలో తలపెట్టిన నేషనల్ స్ట్రైక్ ను విజయవంతం చేయాలని కోరారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Do not want the privatization of state-owned enterprises

Natyam ad