Natyam ad

అధికార పార్టీ శాసన సభ్యులు ధర్నా చేయడమా?

కర్నూల్ ముచ్చట్లు:

ఎక్కడైనా తమ పనులు జరగలేదని ప్రతిపక్ష పార్టీ ధర్నా చేయడం మామూలే కానీ కర్నూలు జిల్లాలో అధికార పార్టీలోని కోడుమూరు శాసనసభ్యులు సుధాకర్ నేడు కర్నూల్ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం వింతగా ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న నేతలకు అధికారులు కచ్చితంగా పనులు చేసి పెట్టాల్సిందే అలాంటిది తన నియోజకవర్గ  పరిధిలోని ఎదురురు  గ్రామంలో  శ్రీ సీతారాముల ఆలయనిర్మాణం  జరగలేదని ధర్నా చేయడం  చూస్తే అధికారులు శాసన సభ్యుని మాట వినడం లేదా. ఎందుకంటే ఎదురురు గ్రామంలో చర్చి మరియు మసీదు ఉన్నాయి కానీ శ్రీ సీతారామాలయం మాత్రం లేదుఎందుకంటే అక్కడ హిందువులు లేరా అంటూ సూటిగా ఆ ఏరియా నేతను ప్రశ్నిస్తూ కోడుమూరు శాసనసభ్యులు సుధాకర్ నేడు కలెక్టరేట్ ముందు గాంధీ సాక్షిగా ధర్నా చేయడం జరిగింది ప్రధానంగా ఆగ్రామంలో కొందరు దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే ప్రతి గ్రామంలో గుడి ఉండాలి కానీ ప్రపంచంలోనే గుడి లేని గ్రామం ఏది అంటే ఎదురురు అనిచెప్పవలసి ఉంటుందని ఆయన అన్నారు ఏది ఏమైనాఅన్ని పార్టీల రాజకీయనేతలు అందరూ ఒక్కటైగుడి నిర్మాణానికి తమతో రావలసిందిగా ఆయన పిలుపు నిచ్చారు.  ఈ విషయంలో  ధర్మ దేవాలయ
శాఖ మరియు పోలీస్ శాఖ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. మరి చూద్దాం శాసనసభ్యుల ధర్నాకు ఫలితం ఉంటుందా ఉండదా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది.

 

Tags: Do the legislators of the ruling party stage a dharna?

Leave A Reply

Your email address will not be published.