మరమ్మత్తులు  చేయండి….మహాప్రభో

విశాఖపట్టణం ముచ్చట్లు:


ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కు ప్లాంటు పట్ల ఏళ్లతరబడి నిర్లక్ష్యం కొనసాగింది. సాంకేతిక పరమైన సమస్యలను పరిష్కరించడంలో జరిగిన అసాధారణ జాప్యం భారీ నష్టాలకు కారణమైంది. కాగ్‌ తాజాగా రూపొందించిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో నిర్లక్ష్యం ఖరీదు అక్షరాల 2,655 కోట్ల రూపాయలు. ఈ నివేదిక ప్రకారం కర్మాగారంలో ఉన్న రెరడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లను 14 నురచి 16 సంవత్సరాల మధ్యలో చేయాల్సిన మరమ్మతులకు తీవ్ర జాప్యం జరిగింది. సమస్యలు తలెత్తిన తరువాత ఒకదానిని 23 ఏళ్లకు, ఇంకోదానిని 24 ఏళ్లకు మరమ్మతులు చేశారు. ఈ జాప్యం వల్ల ఇనుమును కాల్చే గుండాలు చెడిపోయినట్లు తేలింది. ఇదే భారీ నష్టాలకు కారణమైందని కాగ్‌ పేర్కొంది. ఈ జాప్యం వల్ల 2011 నుంచి 2016 వరకు 1.78 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి తగ్గిపోగా, దీని విలువ 1,396 కోట్ల రూపాయలుగా కాగ్‌ పేర్కొంది. అలాగే ప్రధాన ప్యాకేజి, ఆక్సిలరీ ప్యాకేజిల నిర్వహణలో కూడా లోపాల వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమైనట్లు గుర్తించారు. దీరతో నష్టం రూ. 1844 కోట్లకు చేరినట్లు తేలింది. ఉత్పత్తి కూడా 4.93 మిలియన్‌ టన్నులు తగ్గిపోయినట్లు గుర్తించారు. ఇదే సమయంలో ఇతర సౌకర్యాలను సమర్ధవంతంగా వినియోగించుకోకపోవడం వల్ల 2.36 మిలియన్‌ టన్నుల ఉత్పత్తిపై ప్రభావం పడి, నష్టం రూ.2655 కోట్లకు చేరుకున్నట్లు కాగ్‌ తేల్చింది.

 

Tags: Do the repairs….Mahaprabho

Leave A Reply

Your email address will not be published.