పొమ్మన లేక పొగబెడుతున్నారా

అనంతపురం  ముచ్చట్లు:

ఆమెను పొమ్మన లేక పొగ పెడుతున్నారా? మూడేళ్లుగా మహిళా నేత విషయంలో జరుగుతోంది అదేనా? తాజాగా ఒక మీటింగ్‌కు వెళ్లారని షోకాజ్‌ నోటీసు ఇచ్చి.. సస్పెండ్ చేసినంత పని చేశారా?శింగనమల. టీడీపీకి పెద్ద తలపోటుగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రధానమైనది. మూడేళ్లుగా పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఎస్సీ రిజర్డ్వ్‌ నియోజకవర్గమైన శింగనమలలో టీడీపీ అధిష్ఠానం చేసిన కొన్ని తప్పిదాలతో సమస్య జఠిలంగా మారిందనేది తమ్ముళ్లు చెప్పేమాట. అందుకే సమస్య ఎప్పుడు ఏ రూపంలో బయటకు వస్తుందో అంతుచిక్కని పరిస్థితి ఉంది.శింగనమలలో టీడీపీని శమంతకమణి కుటుంబం లీడ్‌ చేస్తుండేది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న యామినీబాలపై వ్యతిరేకత రావడంతో 2019లో బండారు శ్రావణికి టీడీపీ ఛాన్స్‌ ఇచ్చింది. కానీ.. ఎన్నికల్లో చేదు ఫలితం తప్పలేదు. ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. టీడీపీలోని వర్గపోరు ముదురు పాకాన పడింది. పార్టీలోని సీనియర్లను పట్టించుకోవడం లేదని శ్రావణిపై అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో సమస్యను సర్దుబాటు చేస్తారని టుమెన్‌ కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ. ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నర్సానాయుడు ఆ కమిటీలో ఉన్నారు. కానీ.. టుమెన్‌ కమిటీపైనా పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరకు కమిటీలోనే విభేదాలు పొడచూపాయి. ఆ తర్వాత శింగనమలలో టీడీపీ పరిస్థితి మరింత దిగజారించంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో నియోజకవర్గ నేతలతో మాట్లాడి అంతా సెట్‌ చేసినట్టు ప్రచారం జరిగింది.

 

 

 

ఆ తర్వాత బండారు శ్రావణి శింగనమలలో యాక్టివ్‌ అయ్యారు. కానీ.. పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. పుట్లూరు మండలం కొండాపురంలో చంద్రన్న రైతు గ్రామ పోరు గర్జన నిర్వహించారు. కార్యక్రమానికి ఆహ్వానించడంతో శ్రావణి వెళ్లారు. అయితే ఆ సభకు ఎందుకు వెళ్లారని జిల్లా నేతలు శ్రావణిని వివరణ అడగటం చర్చగా మారింది. దీనిపై పార్టీ నేతలు కాల్వ శ్రీనివాసులు, బీటీ నాయుడుకు ఫిర్యాదు చేశారట. టీడీపీలో విభేదాలు సృష్టించేలా.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడుతూ.. అసలు శ్రావణి ఏ హోదాతో చేస్తున్నారని ప్రశ్నలు గుప్పించారట.ఈ ప్రశ్నలకు శ్రావణి గట్టిగానే బదులిచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనను మూడేళ్ల క్రితమే శింగనమల టీడీపీ ఇంఛార్జ్‌గా నియమించారని వ్యతిరేకవర్గానికి బదులిచ్చారట. ఒకవేళ ఇంఛార్జ్‌ పదవి నుంచి తీసేసినట్టు చెబితే.. ఆధారాలు చూపించాలని ఎదురు ప్రశ్నించారట. పార్టీలో గొడవలకు కారణం అవుతున్నవారిపై గతంలో తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇలాంటి విచారణలు ఎందుకు చేయలేదని నిలదీశారట శ్రావణి. ఈ క్రమంలో విజయవాడలో యనమల రామకృష్ణుడు సమక్షంలో శింగనమల పంచాయితీ జరిగినట్టు చెబుతున్నారు. దళిత మహిళను కావడంతో అన్ని వర్గాల వారూ తనను ఇబ్బంది పెడుతున్నారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారట. మరి.. ఈ సమస్య పరిష్కారానికి పార్టీ పెద్దలు ఏ మంత్రం వేస్తారో చూడాలి.

 

Tags:Do you drink or smoke?

Leave A Reply

Your email address will not be published.