కోట మాట మరిచారా..? (వరంగల్)

Dae:08/10/2018
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ కోట అభివృద్ధి పనులు పడకేశాయి. కోటను పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ప్రణాళికలు మాటలకే పరిమితమయ్యాయి. నిధులను సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళిక రూపొందించకుండా.. తోచిన పనులను డిజైన్‌ చేశారు. కానీ అవి చేపట్టడం సాధ్యం కాలేదు. ఏడాదిన్నర తర్వాత తాపీగా తేరుకొని పాత పనులను పక్కన పెట్టి కొత్తగా మళ్లీ ప్రణాళికలు రూపొందిస్తుండడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు హృదయ్‌ పథకాన్ని ప్రవేశపెట్టి దండిగా నిధులు మంజూరు చేసింది.
ఈ పథకం రాష్ట్రంలో ఒక్క వరంగల్‌కు మాత్రమే దక్కింది. కోట, వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి గుడి, పద్మాక్షి, జైన్‌గుట్టతో పాటు కాజీపేట దర్గాలను ఇందులో చేర్చారు. రూ. 42 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఒక వరంగల్‌ కోటకే రూ. 15 కోట్ల వరకు కేటాయించారు.
రూ. 6 కోట్లను వెచ్చించి మట్టి, రాతి కోటల మధ్య భారీ కందకాన్ని తవ్వి, అందులో నీళ్లు నింపి, పర్యాటకుల కోసం బోటింగ్‌ చేయాలని ‘కుడా’ ప్రతిపాదించింది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా సమర్పించింది. పనులకు టెండర్లను పిలిచారు. తీరా పనులు మొదలు పెట్టిన తర్వాత ఇలా కందకం తవ్వి బోటింగ్‌ సాధ్యం కాదని తేలింది.
ఇప్పుడు పాత ప్రతిపాదనలు మొత్తం రద్దు చేసి మళ్లీ ఆ నిధులతో లైటింగ్‌తో పాటు ఇతర పనులు చేపట్టేందుకు మళ్లీ డిజైన్లు చేస్తుంది.హృదయ్‌ పథకం 2015లో మంజూరైంది. పనులు పూర్తయ్యే కొద్ది నిధులు వస్తున్నాయి. కాజీపేట దర్గా అభివృద్ధి పూర్తయింది. వేయిస్తంభాల ఆలయంలో కొంత మేర జరిగాయి. భద్రకాళి బండ్‌ పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయి.
వరంగల్‌ కోటలో కందకం తవ్వేందుకు ఏడాదిన్నర క్రితం నిధులు వచ్చినా పనులు ప్రారంభించలేదు. తీరా ఇప్పుడు తేరుకొని కందకం సాధ్యం కాదంటూ మళ్లీ కొత్త డిజైన్లను రూపొందిస్తున్నారు. మరి డీపీఆర్‌ సిద్ధం చేసే క్రమంలోనైనా పనుల ఆలోచించ లేదు. టెండర్లు పిలిచి, పనులు మొదలయ్యాక డిజైన్లు మార్చడం చూస్తే ప్రణాళిక లేమి స్పష్టమవుతోంది. ఇక్కడ చేపట్టాల్సిన శృంగారపు బావి పనులు కూడా ఇంకా మొదలుకాలేదు.
Tags: Do you know the castle? (Warangal)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *