Natyam ad

ప్రమాణం చేస్తావా… మాడా అనిపించుకుంటావ

-మాజీ సీఎం ఆరోపణలపై ప్రమాణానికి ఎంపీ మిధున్‌ సిద్ధం
– పుంగనూరు మాతల్లిలాంటిది, ఎన్నటికి ద్రోహం చేయం
– 14 ఏళ్ల సీఎం చంద్రబాబు పుంగనూరుకు ఏం చేశారు.?
– ముస్లిం రిజర్వేషన్లపై మోదీతో చెప్పించగలరా..?
– ఆరోపణలపై రాజంపేట ఎంపీ అభ్యర్థి మిధున్‌రెడ్డి తీవ్ర అగ్రహం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

మాజీ సీఎం , రాజంపేట పార్లమెంటు బిజెపి అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పివి.మిధున్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇటీవల పలుమార్లు పెద్దిరెడ్డి కుటుంబంపై కిరణ్‌ ఆరోపణలు చేయగా మంగళవారం పుంగనూరులో జరిగిన ప్రజాగళం సభలో మళ్లీ ఆరోపణలు చేశారు. దీనిపై మిధున్‌రెడ్డి ప్రత్యారోపణలతో కిరణ్‌కు సవాల్‌ విసిరారు. నేను చేసిన ఆరోపణలు నిజం కాదని, కాణిపాకంలో ప్రమాణం చేస్తావ, లేక మాడా గాడినని అనిపించుకుంటావ. ఛాయిస్‌ ఈజ్‌ యువర్స్ అంటు తీవ్రమైన సవాల్‌ విసిరారు. బుధవారం పుంగనూరులో మిధున్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి, పలు అంశాలపై స్పందించారు. తమ కుటుంబంపై చంద్రబాబు- కిరణ్‌లు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని ఆక్షేపించారు. ఇందులో మాజీ సీఎం కిరణ్‌ను ఉద్ధేశించి ఒక సవాల్‌ విసిరారు. కిరణ్‌ను ఉద్ధేశించి…నువ్వు అమరనాథరెడ్డి అనే వ్యక్తికి పుట్టిఉంటే, మీ నాయన అమరనాథరెడ్డి అయితే నేను చేసే ఆరోపణలకు ప్రమాణానికి సిద్ధమా అని సవాల్‌ విసిరారు. నువ్వు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో డబ్బు తీసుకోకుండ న్యాయంగా, నిజాయితీగా పని చేశానని, నీతిమంతుడునని నువ్వు చెప్పే కాణిపాకంలో ప్రమాణం చేయాలని సవాల్‌ చేశారు. కిరణ్‌ చేసిన అన్ని ఆరోపణలపై తాను ప్రమాణానికి సిద్ధమని ప్రకటించారు. మా ఆరోపణలకు స్పందించి నువ్వు (కిరణ్‌) ప్రమాణం చేయలేదంటే నువ్వుక మాడాగాడిక్రింద లెక్క వేసుకుంటా. వచ్చే మూడు రోజుల్లో ప్రమాణం చేయ్‌ లేదంటే నువ్వు అమరనాథరెడ్డికి పుట్టలేదు మాడా గాడు అని తీసిపడేస్తాం. గతంలో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కిరణ్‌ను మాడా అని అన్నారని అది వాస్తవమని బావించాల్సి ఉంటుందన్నారు. అంతే కానీ నువ్వు ఏదంటే అది మాట్లాడితే కుదరదని మిధున్‌రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో రాజంపేట పరిధిలోని పార్లమెంటు స్థానం, 7 అసెంబ్లి స్థానాలలోను వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని, కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రజలు ఓట్లతో తరిమికొడతారని అన్నారు. వ్యక్తిత్వం లేని వ్యక్తి కిరణ్‌ , పదేళ్ల తరువాత వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. ఎన్నికల రోజు తరువాత లేదా కౌంటింగ్‌ తరువాత కిరణ్‌ ఇక్కడి నుంచి వెళ్లిపోవడం ఖాయమన్నారు.

పుంగనూరు మా తల్లిలాంటింది…

పుంగనూరు నియోజకవర్గం మాతల్లిలాంటింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం. చంద్రబాబు, కిరణ్‌లు పుంగనూరుకు చేసిందేమి లేదు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రోడ్లు నిర్మించాం. బస్సు డిపో ఏర్పాటు చేశాం. నీటి ట్యాంకులు నిర్మించాం, ఆసుపత్రి అభివృద్ధి చేశాం. ఆక్సిజన్‌ ప్లాంటు నిర్మించాం. హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువ వెడల్పు పనులు చేపట్టనున్నాం. పుంగనూరులోని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులకు నీళ్లు ఇస్తున్నాం. రెండు కొత్త రిజర్వాయర్లు తీసుకొచ్చాం. వాటర్‌గ్రీడ్‌ పనులకు టెండర్లు పూర్తి చేయగా వచ్చే రెండేళ్లలో పైపులైను ద్వారా ఇంటింటికి తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు. పుంగనూరు ప్రజల ఆశీర్వాదంతోనే తాము రాజకీయంగా ఈస్థాయికి చేరామని అన్నారు.

హేరిటేజ్‌ కంటే అధిక పాలధర ….

మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్‌ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మిధున్‌రెడ్డి అన్నారు. సాధరణంగా అయితే ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. రైతులను మోసం చేస్తున్నామని చేసిన ఆరోపణలు అన్ని అసత్యలేనని అన్నారు. శివశక్తి డైరీ ఏటాటర్నోవర్‌ రూ.25-30 కోట్ల మధ్య ఉంటుందన్నారు. పుంగనూరులోని కేవలం రెండన్నర మండలాల పరిధిలోని పాల సేకరణ జరుగుతోందన్నారు. పుంగనూరులో హేరిటేజ్‌, ఇతర డైరీలు కూడ పాల సేకరణ చేస్తున్నాయన్నారు. హేరిటేజ్‌ కన్న శివశక్తి డైరీ రైతులకు అధిక పాల ధర ఇస్తోందన్నారు. తక్కువ ధర ఇస్తూ మోసాలకు పాల్పడుతోంది హేరిటేజ్‌ అని ఆరోపించారు. ప్రజలు శివశక్తి డైరీవల్ల ఇబ్బంది కలిగి ఉంటే తమకు ఓట్లు వేయవద్దని మిధున్‌రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇక్కడి మామిడి ఆధారిత పరిశ్రమాలు నెలవాలంటే పండ్లను అనంతపురం, కృష్ణగిరి నుంచి పండ్లను తెప్పించాల్సి ఉంటుందన్నారు. ఏ ఒక్క మామిడి రైతు అయిన ఇబ్బంది పడి ఉంటే నేరుగా వచ్చి తమకు చెప్పవచ్చునని ఆయన స్పష్టం చేశారు.

మోదీతో చెప్పించగలవా…

ముస్లింలకు అమలు చేస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయమని కలికిరిలో జరిగిన ప్రధాని మోదీ సభలో కిరణ్‌, చంద్రబాబులు ఆయనతో చెప్పించగలరా అని మిధున్‌రెడ్డి ప్రశ్నించారు. ముస్లింల సంక్షేమాన్ని పరిరక్షిస్తున్నది వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమని అన్నారు. ముస్లిం వ్యతిరేక చట్టాలకు మద్దతుగా నిలిచిన పార్టీలు తమను విమర్శించడం సరైంది కాదని ఆయన అన్నారు. ఎప్పుడైన ముస్లింలకు వ్యతిరేకంగా ఏచట్టం చేసిన తాము వ్యతిరేకిస్తామని, వారికి అండగా ఉంటామని ఎంపీ హామి ఇచ్చారు. ఈ సమావేశంలో పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, రాష్ట్ర జానపదకళల సంస్థ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మండల పార్టీ కన్వీనర్‌ కొత్తపల్లె చెంగారెడ్డి పాల్గొన్నారు.

 

Tags: Do you swear… you seem crazy

 

Post Midle