యువనేతలకు కష్టకాలమేనా

Date:19/08/2019

విజయవాడ ముచ్చట్లు:

ఎన్నికలకు ముందు వారంతా యువనేతలుగా ముద్రపడ్డారు. లోకేష్ టీం అంటూ ఊదరగొట్టేశారు. మహానాడు కార్యక్రమంలోనూ హల్ చల్ చేశారు. ఇంకేముంది పార్టీ కోసం వీరంతా చెమటోడుస్తారని నమ్మారు చంద్రబాబునాయుడు. కానీ తన అంచనా తప్పయిందని ఇప్పుడు ఆయనకు తెలిసింది. 2018 మహానాడులో వారిదే హవా. యువనేత లోకేష్ కు అండగా ఉంటామంటూ అందరూ ముందుకొచ్చారు. పార్టీ అధిష్టానం కూడా వారికి అప్పుడు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది.

 

 

 

 

ఇక ఎన్నికల సమయానికి వచ్చే సరికి యువనేతలు ఆలోచన మామూలుగా లేదు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు స్థానంలో లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని భావించారు. దీంతో తమకు టిక్కెట్లు కావాల్సిందేనని పట్టుబట్టారు. కొందరైతే తమ తల్లిదండ్రుల వద్ద మంకుపట్టి మరీ టిక్కెట్లు పొందినా ఎన్నికలలో మాత్రం గెలవలేకపోయారు. ఇదంతా తెలిసిన కథే అయినా ఇప్పుడు వీరిలో చాలా మంది పార్టీకి అందుబాటులో లేరట. చంద్రబాబు నాయుడు వీరిపై ఆరా తీస్తున్నారట.

 

 

 

 

వారి తల్లిదండ్రులకు ఫో న్ చేసి మరీ చంద్రబాబు ప్రశ్నిస్తుండటంతో సమాధానం చెప్పలేక నేతలు కారణాలు వెతుక్కోవాల్సి వస్తుందట.గత ఎన్నికల్లో రాయలసీమ నుంచి పరిటాల శ్రీరామ్, జేసీ పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్ రెడ్డి , కేఈ శ్యాంబాబు, టీజీ భరత్ , బొజ్జల సుధీర్, గాలి భాను ప్రకాష్ లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల తర్వాత వీరు పత్తా లేకుండా పోయారు. అయితే ఇందులో పరిటాల శ్రీరామ్ మాత్రం నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇంటినుంచి బయటకు రావడం లేదని చెబుతున్నారు. మిగిలిన నేతలు మాత్రం కొందరు హైదరాబాద్ లో వ్యాపారాలకే పరిమితమయ్యారని చెబుతున్నారు.

 

 

 

ఇక దేవినేని అవినాష్ మాత్రం అప్పుడప్పుడూ కన్పిస్తున్నారు. వారసులుగా ఎన్నికల బరిలోకి దిగిన బాలయోగి కుమారుడు హరీశ్, కాగిత కృష్ణ ప్రసాద్, కిమిడి నాగార్జున, ఆడారి ఆనంద్, భరత్ లాంటి వాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన సమీక్షలో వీరి విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. యువతకు అవకాశాలివ్వాలనుకుంటున్న తరుణంలో వీరంతా పార్టీకి దూరంగా ఉండటమేంటని వారసుల పేరెంట్స్ ను నిలదీసినట్లు సమాచారం. మొత్తం మీద చంద్రబాబు వీరికంటే సీనియర్ నేతలే బెటర్ అని నిర్ణయానికి వచ్చినట్లుంది.

పునర్విభజనతో  గులాబీలో జోష్

Tags: Do young people have a difficult time

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *