ప్రేమ విఫలమై డాక్టర్‌ ఆత్మహత్య

Doctor suicides after failing love

Doctor suicides after failing love

Date:08/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రేమించిన యువతితో పెళ్లి విఫలమై ఓ డాక్టర్‌ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అడ్వికేట్స్ కాలనీలో నివాసం ఉన్న వెంకట్రమణ, కౌసల్య దంపతుల కుమారుడు శరత్‌చంద్రకుమార్‌ (26) హైదరాబాద్‌లో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు. కేరళలో ప్రస్తుతం ఎంఎస్‌ చేస్తున్నారు. ఇలా ఉండగా తాను ఎంబిబిఎస్‌ చదివే సమయంలో సహచర విద్యార్థినీతో ప్రేమలో పడ్డాడు. ప్రేమ పెళ్లిదాక దారితీసింది. ఇలాంటి పరిస్థితులలో బాలిక తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోవడంతో శరత్‌చంద్రకుమార్‌ తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. కే రళ నుంచి కుటుంబ సభ్యులకు గత నెల 4న తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసెజ్‌లు పంపాడు. దీంతో బెంబేలెత్తిపోయిన కుటుంబ సభ్యులు హుఠాహుఠిన కేరళ పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే శరత్‌చంద్రకుమార్‌ ఆత్మహత్యకు పాల్పడి ప్రాణపాయ స్థితిలో ఉండగా కేరళ పోలీసులు కేరళ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు చేపట్టారు. కొద్దిరోజుల తరువాత శరత్‌చంద్రకుమార్‌ను వేలూరు ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేపట్టారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృతి చెందాడు. ఈ సంఘటనతో మృతుడి తల్లిదండ్రులు తీవ్ర విషాదానికి లోనై య్యారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోధనలు పలువురిని కలచివేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.

11 వరకు న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణ

Tags: Doctor suicides after failing love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *