Chandrababu into a relaxed mood with Corona

డాక్టర్ సస్పెన్షన్…..స్పందించిన చంద్రబాబు

Date:08/04/2020

అమరావతి  ముచ్చట్లు:

విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఎనస్థీయన్ డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్-95 మాస్కలు  లేవన్న విషయాన్ని దృష్టికి తీసుకు వస్తే.. సమస్యను పట్టించుకోకుండా డాక్టర్ను సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. జగన్ సర్కార్ తీసుకున్న ఈ చర్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ముందుండి పోరాడుతున్న డాక్టర్లను ఇలా అగౌర పరిస్తే ఎలా అని ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్లను, వైద్య సిబ్బందిని జాగ్రత్తగా కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు.
మహిళల రుణాలు వసూలు మూడు నెలలు వాయిదా

Tags: Doctor suspended ….. responding Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *