డాక్టర్ల నిర్లక్ష్యం…

వరంగల్ ముచ్చట్లు:

 

వైద్యో నారాయణో హరి అన్నారు. కానీ ప్రభుత్వాసుపత్రులలో పరిస్థితి వైద్యో నారాయణో హరీ అని కాకుండా.. గవర్నమెంట్ ఆస్పత్రిలోవైద్యం చేయించుకుంటే ప్రాణాలు హరీ మనేలా ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో జరిగిన సంఘటన వైద్యుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతోంది.. అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దంటూ తెలంగాణ ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు సందర్భం వచ్చినా, రాకపోయినా ప్రతి సభలో, సమావేశంలో ప్రజలకు పిలుపు నిస్తున్నారు. పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా చేస్తున్నాం, దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రభుత్వాస్పత్రుల్లోనే అద్భుత సౌకర్యాలతో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామంటూ ఊరూవాడా ఏకమయ్యేలా ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవంలో మాత్రం ప్రభుత్వాస్పత్రులలో నిర్లక్ష్యం తార స్థాయిలో ఉంటోందనడానికి నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సంఘటనే నిదర్శనం. ఆపరేషన్ చేసి ఓ మహిళ కడుపులో దూదిని అలాగే ఉంచి కుట్లు వేసేశారు వైద్యులు. పాపం ఆ మహిళ మూడు రోజుల పాటు నరక యాతన అనుభవించింది. ఇదేంటని అడిగిన బంధువులకు బతికే ఉందిగా ఎందుకు లొల్లి చేస్తారంటూ విసుక్కున్నారు. ఈ దారుణ ఘటన నల్లొండలోని ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. జ్యోతి అనే మహాళకు ప్రభుత్వాసుపత్రిలో  డెలివరీ అయ్యింది. సాధారణ ప్రసవం కాకపోవడంతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు.అంత వరకూ బానే ఉంది. కానీ వైద్యులు ఆమె కడుపులో దూదిని అలాగే ఉంచి కుట్లేసేశారు. పచ్చి బాలింత మూడు రోజుల పాటు నరక యాతన అనుభవించింది.  చివరికి మళ్లీ ఆపరేషన్ చేసి దూది తీసేశారనుకోండి.. కానీ ఇదేంటి సారూ ఇలా చేశారు. బిడ్డ నానా యాతనా పడింది అంటూ ప్రశ్నించిన జ్యోతి బంధువులకు బతికే ఉందికదా ఎందుకు లొల్లి అంటూ సమాధానం చెప్పారు. వైద్యంలో నిర్లక్ష్యానికి తోడు.. బాధితుల పట్ల అంత చిన్నచూపా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి నిర్లక్ష్యినికి పాల్పడిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.

 

Tags:Doctors’ negligence …

Post Midle
Post Midle
Natyam ad