Doctors should always be available to patients

డాక్టర్లు ఎల్లవేళలా రోగులకు అందుబాటులో ఉండాలి

– ఎంపీ  రెడ్డెప్ప వినతి

Date:03/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లు అందరూ రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కోరారు.  సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్  కె.ఎల్. వర్మ ఆధ్వర్యంలో కోవిడ్  నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కలిసి డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రైవేట్ లాడ్జి లు తీసుకొని   హోమ్ క్వారంటైన్ ఏర్పాటు చేసే విషయమై పరిశీలించాలని కమిషనర్ కు సూచించారు. ఈ విషయమై మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్ళి చర్యలు తీసుకోవాలని కోరారు .అలాగే ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి,  వైద్య సేవలు అందించాలని కోరారు. కొన్ని ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేసుకో రండి  అని రోగులకు చికిత్సలు చేయడం లేదని బాధితులు వాపోతున్నారని ఆయన తెలిపారు డాక్టర్లు అందరు సహృదయంతో కరోనా పరీక్షల గురించి రోగులకు ఇబ్బందులు పెట్టకుండా, వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలని కోరారు . పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ డడం ,మరోవైపు వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇలాంటి సమయంలో జలుబు, దగ్గు ,జ్వరం వచ్చిన వారికి కరోనా వచ్చి ఉంటుందని అనుమానం లేకుండా వైద్యం చేయాలన్నారు.  వైద్యులు పేద రోగులకు దేవునితో సమానం అన్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయంలో నిబంధనలను సడలించి పేద రోగులకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించి, పుంగునూరు ఆదర్శవంతంగా నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్లు ప్రభాకర్, శివ, చరణ్ కుమార్, సబి హ కౌసర్ , సుందరం తోపాటు కౌన్సిలర్ అభ్యర్థి  అర్షద్ అలీ పాల్గొన్నారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ

Tags: Doctors should always be available to patients

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *