అసమ్మతి సెగ సద్దుమణుగుతుందా?

Does the disagreement go wrong?

Does the disagreement go wrong?

 Date:12/10/2018
భద్రాద్రి కొత్తగూడెం  ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. పట్టణ-గ్రామీణ ప్రాంతాలను చుట్టేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమపథకాలను హైలెట్ చేస్తూ రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చురుగ్గా పర్యటిస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమని తుమ్మల స్పష్టంచేస్తున్నారు.
నాలుగున్నరేళ్లలో రాష్ట్రం మంచి ప్రగతిని నమోదు చేసిందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో టీఆర్ఎస్ లో అసమ్మతి ఎక్కువవుతోంది. టికెట్ దక్కని నేతలు పార్టీ అధిష్ఠానానికి తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాణోతు మదన్ లాల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో, ఆ మరుసటి రోజు నుంచే మదన్ లాల్ అభ్యర్థిత్వంపై నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ అసమ్మతి జ్వాలలు ఎగసిపడ్డాయి. టీఆర్ఎస్ జిల్లా నేత బొర్రా రాజశేఖర్ నేతృత్వంలో కొన్నిరోజుల క్రితం వైరాలో భారీ ర్యాలీ, సభను నిర్వహించారు.
ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, మదన్ లాల్ పై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని… ఆయన వల్ల వైరాలో టీఆర్ఎస్ కు పరాభవం తప్పేలా లేదని అన్నారు. ర్యాలీ సందర్భంగా అసమ్మతి నేతలు, మదన్ లాల్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఏదేమైనా ఈ వివాదాలను అధిగమించి గెలుపే ధ్యేయంగా కృషి చేయాలని పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు.
Tags:Does the disagreement go wrong?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *