Natyam ad

గరీబోడు పైకొస్తే గుండెలు గాయపరుస్తరా

-మంచి సంకల్పంతో ఏదైనా సాధించుకోవచ్చు
-గరీబుబిడ్డ రాజలింగును ఆదర్శంగా తీసుకోవాలే
-తప్పుగా చిత్రీకరించే కాంగ్రెసోళ్లకు జ్ఙానోదయం కావాలే
-జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్

మంథని ముచ్చట్లు:

గరీబోళ్లు ఆర్థికంగా ఎదిగితే ఏదో తప్పుచేశారంటూ గుండెలు గాయపర్చడం సరికాదని పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్ హితవు పలికారు. మంగళవారం మంథని పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడ్డ  కడియాల రాజలింగు దుకాణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈనాడు ఒక గరీబు పైకొస్తే కాంగ్రెస్‌ నాయకులు ఓర్వలేక పోతున్నారని, డబ్బు సంపాదిస్తే ఎవరినో దోచుకున్నారని  దుష్స్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక మంచి సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని రాజలింగు నిరూపించారని ఆయన గుర్తు చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన రాజలింగు ఒకప్పుడు ఒక కిరణ దుకాణంలో గుమస్తాగా పనిచేశారని, ఆనాడు ఐదు వందలు, వెయి రూపాయలకు పనిచేసిన ఆయన ఈనాడు లక్షల విలువ చేసే ఒక దుకాణాన్ని నడుపుకోవడం గొప్ప విషయమన్నారు. అయితే లక్షల వ్యాపారం చేసినంత మాత్రాన ఏదో తప్పు చేసినట్లా ఆయన  ప్రశ్నించారు. రాజలింగుకు ముందు, వెనుక ఎవరో ఒకరు ప్రోత్సహించడం ద్వారానే ఆర్థికంగా ఎదిగాడన్నది వాస్తమన్నారు. అయితే ఇలా పైకొచ్చే వారిపట్ల కాంగ్రెస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ గుండెలు గాయపర్చుతున్నారని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు.తప్పుగా ఆలోచన చేసే కాంగ్రెస్‌ నాయకులు రాజలింగును చూసి జ్ఞానోదయం కావాలన్నారు.

 

 

Post Midle

బీదబిడ్డగా తాను ఆర్థికంగా ఎదిగితే అనేక అబండాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే సంపాదించుకున్నాడని మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆయన వాపోయారు. బీదోడు పైకి రావడానికి  అతని కుటుంబ సభ్యులు అండగా నిలిచే అవకాశాలు ఉంటాయని, ఆ దిశగా ఆలోచన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. గరీబోడు పైకి  వస్తే తప్పులు చేసినట్లేనా అని ఆయన  అసహనం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి సంపాదిస్తే ఇది  ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్టా సంపాదించావని ప్రశ్నించడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ నాయకుల్లాగ బెంగళూర్‌,  అమెరికా, హైదరాబాద్‌, ముంబైలాంటి ప్రాంతాల్లో దాచుకుంటలేమని ఆయన  అన్నారు. తాము ఈ మట్టిలో పుట్టిన బిడ్డలుగా ఇక్కడే ఉంటామని, ఏది ఉన్నా ఇక్కడే  జీవిస్తామే తప్పఇతర ప్రాంతాలకు వెళ్లమన్నారు. ఒకప్పుడు అనేక ఇబ్బందులు పడ్డ తాము మంచిగా బతుకాలని కోరుకోవడంలో తప్పేంటి అని ప్రశ్నించారు. మంచిగా బతికినా తప్పుగా చిత్రీకరించే కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరుచుకోవాలని, ఏది మంది ఏది చెడు అనేది గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం  కడియాల రాజలింగును జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఘనంగా సన్మానించారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ,  ఎంపీపీ కొండ శంకర్‌, జెడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త  శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Does the heart break when the poor get up?

Post Midle