వరుస జీవోలతో సమస్య కొలిక్కి వచ్చేనా
విజయవాడ ముచ్చట్లు:
ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘ నేతలతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. డీఏలు, గ్రామ గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ , ఏరియర్స్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ వాటిపై చర్చించారు. అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలుస్తోంది. అన్ని అంశాలను టైం బాండ్ ఉంది..వచ్చే నెల 1 నుంచి జీఓ లు వస్తాయని ఉద్యోగ సంఘనేతలకు మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. కొత్త కొత్త పీఆర్సీ పై కూడా చర్చ జరిగిందని… . సీఎం తో చర్చించిన తర్వాత కొత్త పీఆర్సీ కమిటీ పై ప్రకటన ఉంటుంది ఉంటుందని తెలిపారు. మాతో ఉన్న సంఘాలను మాత్రమే సమావేశం జరిగిందని.. కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు బయట మాట్లాడితే తాను స్పందించనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగులకు సంబంధించి డీఏ జీఓ త్వరలో వస్తుందని ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. సీపీఎస్ ఇంప్లిమెంట్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఓపిఎస్ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
వచ్చే కాబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగులకు ఓపిఎస్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. యూనివర్సిటీ ఉద్యోగులు.. కార్పొరేష్షన్ ఉద్యోగులకు పదవీవిరమణ వయస్సు 62 ఉండాలని కోరాము.. అన్ని సంఘాలు కలిసి వినతి పత్రం ఇవ్వాలని కాబినెట్ సబ్ కమిటీ కోరిందన్నారు. ఎంప్లాయ్ హెల్త్ కార్డ్ కు సంబంధించి జూన్ 1 నుంచి ప్రభుత్వం నుంచి ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ కట్ అయ్యేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతి అంశానికి సమస్యకి టైం బాండ్ ఉంది..అన్ని సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ఉద్యోగులకు వైసీపీ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, జీత భత్యాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించకపోవడం, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి హామీలు నెరవేర్చలేదు. దీంతో ఉద్యోగ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే మార్చి 9 నుంచి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం చేస్తోంది. ఇప్పటికైనా ఉద్యోగులందరూ నిర్లక్ష్యం వహించకుండా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమంలో పాలుపంచు కోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహిస్తున్నామని,

అందరూ హాజరు కావాలని కోరారు. ఉద్యోగుల మలిదశ ఉద్యమం ఓర్పుతో సాగుతోందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. ఉద్యమం తీవ్రమైతే తాము బాధ్యులం కాదని అన్నారు. డిమాండ్ల పరిష్కారానికి 47 రోజులుగా నిరసనలు తెలుపుతున్నామని బొప్పరాజు వివరించారు. రెండుసార్లు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యామని, కానీ సమావేశాలతో ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఉద్యమ నేపథ్యంలో, ఈ నెల ఏపీ ఎన్జీవోలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం అవుతున్నట్టు బొప్పరాజు వెల్లడించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, పాత బకాయిలు ఎన్నేళ్లకు ఇస్తారో తెలియడంలేదని బొప్పరాజు వాపోతున్నారు.
Tags:Does the problem come up with a series of creatures?
