ఫూట్ పాట్ వ్యాపారస్థులకు చేయూత

Date:3/08/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

పుట్ పాత్ లపై వ్యాపారాలు నిర్వహించుకొనే వారికి తగు న్యాయం జరిగేలా చూస్తానని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బాటా వరకు చేపట్టిన వైట్ టాపింగ్ రోడ్ నిర్మాణం పూర్తయి పుట్ పాత్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సోమవారం పుట్ పాత్ వ్యాపారుల తో మోండా మార్కెట్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను తొలగించేందుకే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రోడ్లు, పుట్ పాత్ ల నిర్మాణం చేపడుతుందని అన్నారు. రోడ్లపై, పుట్ పాత్ ల పై అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తుండటం వలన ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. తోపుడు బండ్లు, పుట్ పాత్ వ్యాపారులకు న్యాయం జరిగేలా చూస్తానని ప్రకటించారు. ఎంతమంది వ్యాపారులు ఉన్నారు,  వారికి ఎంత స్థలం అవసరమో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ట్రాపిక్ పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు.

 

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Tags:Doing so for foot pot traders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *