Dollar below 70 rupees

Dollar below 70 rupees

Date:29/11/2018
ముంబై ముచ్చట్లు:
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ బాగా బలపడింది. గురువారం (నవంబరు 29) నాటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ రూ.70.15 వద్ద ప్రారంభమైంది. నిన్నటి ట్రేడింగ్‌లో పోలిస్తే.. నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ.. తర్వాత మరింత పుంజుకునన్న రూపాయి ఓ దశలో గరిష్ఠంగా 57 పైసలు బలపడి 70.05 వద్దకు చేరింది. నిన్న ట్రేడింగ్‌ చివర్లో రూపాయి 17 పైసలు బలపడి రూ.70.62 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల సమయానిక 69 పైసలు బలపడి 70 దిగువకు చేరి.. 69.93 వద్ద ట్రేడ్ అవుతోంది. గడచిన మూడు నెలల కాలంలో రూపాయి ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి. సెంట్రల్‌ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు లక్ష్యం ముగింపు దశకు చేరిందని అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమీ పావెల్‌ చేసిన వ్యాఖ్యలతో ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలరు విలువ బలహీన పడుతోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, దేశీయ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా దేశీయ కరెన్సీల విలువ బలపడడానికి దోహదపడుతోందని నిపుణులు అంటున్నారు. రూపాయి బలపడిన నేపథ్యంలో ఈరోజు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Tags:Dollar below 70 rupees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *