టీటీడీకి 50 సైకిళ్లు విరాళం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారికి బుధవారం చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రశాంత్ రూ.7 లక్షల విలువైన 50 సైకిళ్ళు విరాళంగా అందజేశారు.శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాత సైకిళ్లను టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రంలో టీటీడీ బోర్డు సభ్యులు సౌరబ్, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి,వివో బాల్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు ప్రభాకర్ బాబు, భారతి, అభిషేక్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Tags: Donate 50 bicycles to TTD
