రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి

Date:08/09/2020

-పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్

వరంగల్  ముచ్చట్లు:

పర్కాల శాసనసభ్యులు  చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడులను పురస్కరించుకోని సంగేం మండలం ఆశాలపల్లి గ్రామంలో ఎర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంగళవారం పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ జ్యోతి ప్రజ్వల చేసి రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్  ముందుగా పర్కాల శాసన సభ్యుడు చల్లాధర్మరెడ్డిగారికి పుష్పా గుచ్చాలు అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు  తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ఈ రోజు యువతలో స్ఫూర్తిని కలిగించే రీతిలో  తన జన్మదినం సందర్భంగా  రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ్యులు చల్లాధర్మారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. అదే విధంగా ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం కోసం స్వచ్చందంగా తరలివచ్చిన యువతకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.

ప్రస్తుత జీవన విధానంలో అన్నిదానాల కన్నా రక్తదానం మిన్న అని ప్రతి ఒక్కరు గుర్తించాల్సి వుంటుందని. సాటి మనిషి ప్రాణాలను నిలపడం కేవలం రక్తదానం వలనే సాధ్యపడుతుందని. ప్రమాదం జరిగినప్పుడు, ప్రసవం సమయంలో మరియు ఆనారోగ్యం గురైనవారికి రక్తం చాలా అవసరం. ఇలాంటి సమయాల్లోనే సాటి మనిషికి రక్తదానం చేసి వారి ప్రాణాలను నిలపడంతో యువత ముందు వుండాలి. రక్తదానం చేయడం వలన మనిషిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, ఆరోగ్యంగా వున్న వ్యక్తి ఎన్నిసార్లు అయిన రక్తదానం చేసిన ఆరోగ్యంగానే వుంటారు.

 

ప్రతి ఒక్కరు ధైర్యంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావల్సి వుంటుంది, రక్తదానం చేసి అపదలో వున్నవారిని అదుకోవాల్సిన భాధ్యత నేటి యువతపై వుంది. ముఖ్యంగా నేడు ప్రపంచ జనాభా కరోనా వ్యాధితో పోరాడమే కాక లక్షల సంఖ్యలో కరోనా వ్యాధి భారీన పడి మరణిస్తున్నారు. ఈ విపత్కర సమయంలో కరోనా వ్యాధితో పోరాడుతున్న కరోనా వ్యాధిగ్రస్తులను తిరిగి ఆరోగ్యవంతులు చేసేందుకు ఆరోగ్యవంతులు రక్తదానం చేయడంతో పాటు, కరోనా వ్యాధినుండి కోలుకున్న వారు కరోనా వ్యాధి చికిత్స అవసరమైన ప్లాస్మా దానం చేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చేందుకు సిద్ధం కావాలని. కరోనా వ్యాధిగురై చికిత్స పొందుతున్న వారికి దాతల నుండి ప్లాస్మా అందించేందుకు వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో కోవిడ్-19 కట్టెట్రోల్ రూంను ఏర్పాటు చేయడం జరిగింది.

 

ప్లాస్మా అవసరం వున్నవారు ఈ కంట్రోల్ రూం వాట్సప్ నంబర్ 9491873930కు సమాచారం అందింస్తే తక్షణమే భాధితులకు ప్లాస్మా దానం చేసే దాతల వివరాలను పంపించడం జరుగుతుంది. అదే ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతలు ముందుగా ఈ కోవిడ్-19 కంట్రోల్ రూంలో తమ పేరును నమోదు చేసుకోవాల్సి వుంటుందని. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు రక్తం మరియు ప్లాస్మాను స్వచ్చందంగా దానం చేసేందుకు యువత ముందుకు రావాలని, ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపే ఇలాంటి రక్తదాన శిబిరాలను మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని తెలియజేశారు.
అనంతరం రక్తదానం చేసిన దాతలకు పోలీస్ కమిషనర్  చేతుల మీదుగా సర్టిఫికేట్లను అందజేశారు.

 

అంతర్వేదిలో ఉద్రిక్తత

Tags:Donate blood and stand as a lifesaver

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *