రక్త దానం చేయండి- ప్రాణ దాతలు కండి            

-మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ

మంథని ప్రతినిధి ముచ్చట్లు:


రక్త దానం చేయండి ప్రాణ దాతలు కండి అని మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ యువకులకు పిలుపునిచ్చారు.          మంథని పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో 75సంత్సరాల భారత స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా మంథని ప్రభుత్వ హాస్పిటల్ లో  రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ముఖ్యఅతిథిగా పాల్గొని  రక్తదాతలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. రక్తదానం చేసిన వారందరిని ఆమే అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, రాష్ట్రవ్యాప్తంగా రక్తహీనత తో బాధపడుతున్న వారు అనేకమంది ఉన్నారు.  అత్యవసర సమయంలో రక్తం అందించిన వారే అసలైన హీరో అని, రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ప్రాణహాని ఉండదని ప్రజలు ఇలాంటి అపోహాలు నమ్మకూడదని,  రక్తదానం వల్ల ఇంకొకరి ప్రాణాలు నిలిపిన వారం అవుతామని, కచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అవసరమున్న ఆపద సమయంలో రక్తం దానం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, ఎంపీపీ కొండ శంకర్, జడ్పిటిసి తగరం సుమలత శంకర్ లాల్, కౌన్సిలర్లు వీకే రవి, నక్క నాగేంద్ర శంకర్, శ్రీపతి బానయ్య, కాయితి సమ్మయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, కుర్ర లింగయ్య, కో ఆప్షన్ మెంబర్స్ అంకరి పద్మజాకుమార్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎగొలపు శంకర్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తగరం శంకర్ లాల్, జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి,  మంథని ప్రభుత్వాసుపత్రి సూపరిడెంట్ శౌరయ్య, గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శంకరా దేవి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Donate blood – become life donors

Leave A Reply

Your email address will not be published.