పుంగనూరులో రక్తదానం చేయండి
పుంగనూరు ముచ్చట్లు:
సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం అలవర్చుకోవాలని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్ డాక్టర్ శరణ్ పిలుపునిచ్చారు. సోమవారం మెడికల్ ఆఫీసర్ మమతారాణీ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అధిక సంఖ్యలో యువకులు హాజరై, రక్తదానం చేశారు. డాక్టర్ శరణ్ మాట్లాడుతూ రక్తదాన శిబిరం క్రమం తప్పకుండ పుంగనూరులో నిర్వహిస్తామన్నారు. సేకరించిన రక్తాన్ని ఆపదలో ఉన్న బాధితులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు.
Tags: Donate blood in Punganur