కరోనా తో మృతి చెందిన సోదరుల కుటుంబానికి చేయూత

-25 వేలు ఆర్థిక సహాయం అందించిన బిల్డర్ శ్రీనివాస్

 

జగిత్యాల ముచ్చట్లు :

 

ప్రపంచాన్ని గడగడలాదిస్తున్న కరోనా కాటుకు చాలా కుటుంబాలు కకావికాల మయ్యాయి. జగిత్యాలకు చెందిన గోవిందుపల్లి ఆర్యవైశ్య సంక్షేమ సంఘం సభ్యులు,అన్నదమ్ములు చెట్ల రవీందర్, చెట్ల రాజేందర్ స్థానిక కొత్త బస్టాండ్ దగ్గర మ్యూజిక్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అన్నదమ్ములకు కరోనా సోకి కేవలం ఒకరోజు తేడాతో ఇద్దరు  మృత్యువాతపడ్డారు.ఆ కుటుంబానికి జీవనాధారమైన ఇద్దరు మరణించడంతో కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. ఈ విషయమై సంఘం అధ్యక్షులు  పబ్బ శ్రీనివాస్ వారి కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని తన స్నేహితుడైన హైదరాబాదుకు చెందిన  మంచుకొండ సురేందర్ ను సంప్రదించారు.స్పందించిన  బిల్డర్  గౌరిశెట్టి శ్రీనివాస్  వెంటనే  రాజేందర్ సతీమణి  చెట్ల లావణ్య  బ్యాంక్ అకౌంటులో రూ. 25 వేలు  జమ చేయడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన  గౌరిశెట్టి శ్రీనివాస్,సహాయపడిన మంచుకొండ సురేందర్, సంఘం అధ్యక్షులు, జర్నలిస్ పబ్బ శ్రీనివాస్ లకు లావణ్య ధన్యవాదాలు తెలిపారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Donate to the family of the brothers who died with Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *