Natyam ad

గౌతమేశ్వర గోశాలకు 50 కట్టల పచ్చ గడ్డి అందజేత

మంథని ముచ్చట్లు:


మంథని పట్టణంలోని శ్రీ గౌతమేశ్వర గోశాల కు 50 కట్టల పచ్చ గడ్డిని ఏఎమ్ఆర్ ఇండియా లిమిటెడ్ తాడిచెర్ల కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్ జిఎం ఏ ప్రభాకర్ రెడ్డి, సూపర్వైజర్ అమర్నాథ్ రెడ్డి లు శుక్రవారం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
మంథని పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ గౌతమేశ్వర గోశాలలో గో గ్రాసం లేక ఇబ్బంది పడుతుందన్న విషయాన్ని తెలుసుకొన్న
ఏఎమ్ఆర్ ఇండియా లిమిటెడ్ తాడిచెర్ల కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్ జిఎం ఏ ప్రభాకర్ రెడ్డి, సూపర్వైజర్ అమర్నాథ్ రెడ్డి లు స్పందించారు. వెంటనే వాహనం ద్వారా గోశాలకు దాదాపు 5వేల రూపాయల విలువ చేసే 50 కట్టల పచ్చ గడ్డిని అందించి మూగజీవాల ఆకలి తీర్చారు. వారికి శ్రీ గౌతమేశ్వర గోశాల తరఫున గౌతమేశ్వర గోశాల చైర్మన్ ఆకుల స్రవంతి విద్యాసాగర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

Tags: Donation of 50 bundles of green grass to Gautameshwara Goshala

Post Midle
Post Midle