Donation of five tons of peanuts

ఐదు టన్నుల వేరుశెనగ పప్పు విరాళం

– టీటీడీ చైర్మన్ కు అందించిన దాత  పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి

Date:02/07/2020

తిరుపతిముచ్చట్లు:

నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన పి.శ్యామ్ ప్రసాద్ రెడ్డి టిటిడి అన్నదానం ట్రస్ట్ కు ఐదు టన్నుల వేరుశెనగ పప్పు విరాళంగా అందించారు. గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి కి వీటిని అందించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి తన సొంత భూమిలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వేరుశెనగ పప్పు విరాళంగా ఇవ్వడం సంతోషమన్నారు. అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సచివాలయాల రంగులు మార్పు

Tags:Donation of five tons of peanuts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *