Donation of lakhs of rupees to Brahmin Cemetery

బ్రాహ్మణ స్మశాన వాటికకు లక్షరూపాయలు విరాళం

Date:24/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు బ్రాహ్మణ సంఘ స్మశానవాటికకు లక్షరూపాయలు విరాళం అందించారు. గురువారం వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి దామోదర్‌రాజు , సంఘ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు లక్షరూపాయల విరాళం చెక్కును బ్రాహ్మణులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు మదుకుమార్‌శర్మ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని స్మశాన వాటిక అభివృద్ధికి గత వారం మంత్రి పెద్దిరెడ్డి నిధులు విడుదల చేశారని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దామోర్‌రాజు లక్షరూపాయలు విరాళం ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. బ్రాహ్మణుల స్మశానవాటికకు కావాల్సిన అన్ని వసతులు కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు రామకృష్ణ, కోదండరామయ్య, కృష్ణమూర్తి, సుధాకర్‌, గిరి, మురళి, రాజేష్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సాయి ఆలయంలో ఆరవ అన్నదాన వార్షికోత్సవం

Tags: Donation of lakhs of rupees to Brahmin Cemetery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *