ఆత్మకూరుకి వరి కోత మిషన్ అందజేత..

ఆత్మకూరు ముచ్చట్లు:
క్లస్టర్ హేరింగ్  సెంటర్ ద్వారా ఆత్మకూరు మున్సిపాలిటీకి వరి కోత మిషన్ ను అందజేయడం జరిగింది. వరి కోత మిషన్ను
సొసైటీ చైర్మన్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రైతుల పట్ల రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, రైతు సేవలో భాగంగా వరి కోత మిషన్ రైతుల సౌకర్యార్థం చేయడం జరిగిందని వరి కోత మిషన్ ఆత్మకూరు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు సేవే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని దానికి నిదర్శనం రైతులకు వారి కోత మిషన్ ను అడగకుండానే అందజేయడమే దీనికి నిదర్శనమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
 
Tags:Donation of rice harvesting mission to Atmakur

Leave A Reply

Your email address will not be published.