టీటీడీ ట్ర‌స్టుకు రూ.1.5కోట్లు విరాళం

తిరుమల ముచ్చట్లు:

రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ము ఖేష్ అంబానీ శుక్రవారం టీటీడీ ట్ర‌స్టుకు రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు.ఇందుకు సంబంధించిన డీడీని తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో  ఎవి. ధర్మారెడ్డికి అందజేశారు.శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న తరువాత‌, కార్పొరేట్ దిగ్గజం తిరుమలలోని ఎస్వీ గోశాలను కూడా సందర్శించారు.ఎంపీలు   గురుమూర్తి,   విజయసాయిరెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు   సి.భాస్కర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు   రమేష్ బాబు,   హరీంద్రనాథ్, ఓఎస్‌డి రిసెప్షన్ ఇన్‌ఛార్జ్   మురళీధర్, విజివో   బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Donation of Rs.1.5 crores to TTD Trust

Leave A Reply

Your email address will not be published.