ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.12 లక్షలు విరాళం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు శుక్రవారం రూ.12 లక్షలు విరాళంగా అందింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి దాతలు విరాళం డిడిలను అందజేశారు.హైదరాబాదుకు చెందిన ఈవీఎస్ఆర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫున వారి ప్రతినిధి తిరుపతికి చెందిన శ్రీ రాఘవేంద్ర 10,00,116 రూపాయలు విరాళం అందించారు.అదేవిధంగా బెంగళూరుకు చెందిన కెసి.రెడ్డి, సరోజమ్మ వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫున ఎస్వీబీసీ బోర్డు సభ్యురాలు వసంత కవిత రూ.2 లక్షలు విరాళంగా అందించారు.

Tags:Donation of Rs.12 lakhs to SVBC Trust
