Natyam ad

టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం

తిరుమల ముచ్చట్లు:

చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు   శేఖర్ రెడ్డి నేతృత్వంలో తొమ్మిది మంది దాతలు కలిసి టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం అందించారు. దాతలు ఈ మొత్తానికి సంబంధించిన డీడీని సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్   వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.చెన్నై టి.నగర్‌లోని వెంకటనారాయణ రోడ్‌లో ప్రస్తుతం ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ కోసం స్థలం కొనుగోలుకు ఈ మొత్తాన్ని అందించారు. ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న రూ.35 కోట్ల విలువైన 5.5 గ్రౌండ్ల స్థలాన్ని చెన్నై స్థానిక సలహామండలి గుర్తించింది. ఈ స్థలం కొనుగోలుకు గతంలో కొంతమంది దాతలు 8,15,15,002 రూపాయలను విరాళంగా అందించారు.

 

 

Post Midle

ప్రస్తుతం విరాళం అందించిన దాతలు ర్యాపిడ్‌కేర్ గ్రూపు రూ.1.50 కోట్లు, కోయంబత్తూరుకు చెందిన వెంకట సుబ్రహ్మణ్యం, నాగరాజన్, సిఆర్
కన్ స్ట్రాక్షన్స్ వారు ఒక్కొక్కరు కోటి రూపాయలు,    శరణ్,   శెంబగమూర్తి ఒక్కొక్కరు 20 లక్షలు,   నరేష్ సుబ్రహ్మణ్యం,   బలహా కెమికల్స్(పి) లిమిటెడ్ వారు ఒక్కొక్కరు రూ. 10లక్షలు, నీలాద్రి ప్యాకింగ్స్ రూ.1లక్ష రూపాయలు విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో  ఎవి ధర్మారెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

 

Tags:Donation of Rs.5.11 crores to TTD

Post Midle